అమిత్ షాతో పవన్, కిషన్​రెడ్డి భేటీ.. తెలంగాణలో పొత్తులపై చర్చ

అమిత్ షాతో పవన్, కిషన్​రెడ్డి  భేటీ..  తెలంగాణలో పొత్తులపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ -జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌‌‌‌‌‌‌‌లో అమిత్‌‌‌‌‌‌‌‌ షా నివాసంలో వీరు సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. 

ఇప్పటికే స్టేట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ను కలిసి  తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, గ్రేటర్​ హైదరాబాద్‌‌లోని శేరిలింగంపల్లి, కూకట్​పల్లితో పాటు 32 సీట్లు తమకు కేటాయించాలని జనసేన పట్టుబడుతున్నట్లు తెలిసింది. కానీ, బీజేపీ కేవలం 6 నుంచి 10 స్థానాలు మాత్రమే జనసేనకు కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. పొత్తులపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.