
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు క్రేజ్ మాములుగా లేదు. ఈ షోకు తాజాగా పవర్స్టా్ర్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చారు. బాలయ్య, పవన్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానుల్లో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేస్తూ ఆహా కొద్దిసేపటి క్రితం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్లో బాలయ్య, పవన్ మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈ మధ్య మీ విమర్శల్లో వాడివేడీ డబుల్ ఇంఫాక్ట్ అయిందని బాలయ్య అడిగితే... నేను చాలా పద్దతిగా మాట్లాడుతానంటూ పవన్ నవ్వుతూ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటే అవి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కాలేదని బాలయ్య.. పవన్ ను ప్రశ్నించారు. దీనికి పవన్ ఏం సమాధానం ఇచ్చారన్నది అభిమానుల్లో అసక్తి నెలకొంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.