
రీసెంట్ గా బ్రో(Bro) సినిమాతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan).. ప్రస్తుతం వారాహి(Varahi yatra) మూడో విడత యాత్రలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా పవన్ అభిమానులు తమ అభిమాన నాయకుడిని, హీరోను చూసి మురిసిపోతుంటే.. మరికొందరు అత్యుత్సహాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పవన్ అభిమాని ఒకరు తన బిడ్డను పవన్ చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చేశారు. అది కాస్త అసౌకర్యంగా ఫీలైన పవన్ కళ్యాణ్ అతన్ని పట్టించుకోకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతొంది.
Lesson: How Not to Behave as a Parent
— Bhavya? (@unexpected5678) August 15, 2023
pic.twitter.com/8L0nhl3Pny
ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తుండగా.. ఒక అభిమాని ఎదురుగా వచ్చి తన బిడ్డను పవన్ కి ఇచ్చేందుకు ప్రత్నించగా... పవన్ అది పట్టించుకోకుండా ముందుకు నడిచారు. కానీ ఆ అభిమాని పవన్ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి మరీ తన బిడ్డని ఇచ్చే ప్రయత్నం చేశాడు. పవన్ ఆబిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పటికీ సరిగా పట్టుకోలేకపోయారు. దీంతో ఆ బిడ్డని వెనక్కి తిరిజి ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వరాల అవుతోంది.
ఆ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. ఎంతో ప్రేమగా అతను తన బిడ్డను చేతుల్లో పెడుతుంటే పట్టించుకోరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో.. ఆయన ఏది హడావుడిలో ఉన్నారు అలాంటి సమయంలో హఠాత్తుగా చిన్న పిల్లాడిని చేతిలో పెడితే అలానే ఫీల్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అభిమానం ఉండాలి కానీ అతి ఉండకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.