
పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ OG మూవీ మరికొన్ని గంటల్లో ధియేటర్లలో సందడి చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది ధియేటర్లలో OG టికెట్ బుకింగ్స్ వేగంగా బుక్ అవుతున్నాయి. కాకపోతే ఒకే ఒక్కటి మాత్రం పవన్ ఫ్యాన్స్ కు కొంచెం ఇరిటేట్ చేస్తుంది. అది ఏంటీ అంటే OG మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వటమే. పవన్ కల్యాణ్ మూవీకి ఏ సర్టిఫికెట్ అంటే.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ధియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు.. ధియేటర్లలోకి వాళ్లకు ఎంట్రీ ఉండదు. ఈ క్రమంలోనే అసలు పవన్ కల్యాణ్ మూవీకి A సర్టిఫికెట్ వచ్చిన మూవీస్ ఏంటీ అనేది ఆసక్తి రేపుతోంది.
అది 2011 సంవత్సరం. అప్పట్లో పంజా మూవీతో వచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ సినిమాకు కూడా A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. పవన్ మూవీస్ సహజంగా ఫ్యామిలీ, పిల్లలు అందరూ చూసే విధంగా ఉంటాయి. అప్పట్లో పంజాకు.. ఇప్పుడు OGకు A సర్టిఫికెట్ రావటం యాదృశ్చికమే.. 14 ఏళ్ల తర్వాత ఇలా జరిగింది మళ్లీ..
ALSO READ : ఓజీ బాక్సాఫీస్ లెక్కలు.. వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత?
OG మూవీస్ A సర్టిఫికెట్ ఇవ్వటానికి కారణం ఇదే :
OG మూవీ ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది.. ఇది మాస్.. ఊర మాస్ అని. గన్ వయలెన్స్ బీభత్సం అనేది స్పష్టం అవుతుంది. అయితే సెన్సార్ బోర్డు 2 నిమిషాల వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందంట. ఏడు సన్నివేశాల్లో మార్పులు కోరిందంట. ఒక లాడ్జీలో ఓ నిమిషం సన్నివేశాలు రక్తపాతంతో బీభత్సంగా ఉన్నాయంట. తలలు, చేతులు, కాళ్లు నరికివేయటం, గన్ వయలెన్స్, స్మోకింగ్ విజువల్స్, మందు కొట్టటం, డ్రగ్స్ వాడకం వంటి హానికరమైన సన్నివేశాలు ఉన్నాయంట. ఈ కారణాలతోనే సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిందంట. వయలెన్స్ మరీ ఎక్కువగా ఉండటంతో.. చిన్న పిల్లలు చూడొద్దని స్పష్టం చేస్తూ.. చిన్న పిల్లలకు ధియేటర్లలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేసింది సెన్సార్ బోర్డు.
OG మూవీలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీతోపాటు యళయాళి నటి ప్రియాంక మోహన్ నటిస్తుంది. దీంతో పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. విదేశాల్లోనూ అంటే అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ దేశాల్లోని తెలుగు సినిమా అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.