TheyCallHimOG: రికార్డ్ బద్దలు కొట్టే పనిలో పవర్‌స్టార్.. అక్కడ ‘ఓజీ’ స్పీడు మాములుగా లేదు

TheyCallHimOG: రికార్డ్ బద్దలు కొట్టే పనిలో పవర్‌స్టార్.. అక్కడ ‘ఓజీ’ స్పీడు మాములుగా లేదు

పవన్ కళ్యాణ్‌‌‌‌ నుంచి వస్తున్న మోస్ట్‌‌‌‌ అవైటెడ్‌‌‌‌ మూవీ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్​ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా, త్వరలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌‌‌‌.

ఓవర్సీస్ నిర్మాణ సంస్థ ప్రత్యంగిరా ట్వీట్ చేస్తూ.. “మేటి ధాటికి లోకం హడలే.. పవర్‌స్టార్ రికార్డ్ బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు.. ఆకలితో ఉన్న చిరుతలాగా లెక్కలను పెంచుతూ వేటాడుతున్నాడు. #TheyCallHimOG ఇప్పుడు ఫాస్టెస్ట్ $1M+ ఉత్తర అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ సాధించిందని’’ ట్వీట్ చేసింది. 

మరోవైపు ప్రీ సేల్స్‌‌‌‌ రూపంలో ఓవర్సీస్‌‌‌‌లో ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లను రాబట్టి సంచలనాలు సృష్టిస్తోంది. ఓజాస్‌‌‌‌ గంభీర అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో పవన్ కళ్యాణ్‌‌‌‌ నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌గా కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్.  ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.