
రిలీజ్కు ముందే పలు రికార్డులు సృష్టించిన OG థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే గ్రాండ్ ఎలివేషన్స్ మూమెంట్స్ వచ్చిన ఓజీకి ప్రస్తుతానికి మిక్సెడ్ రివ్యూలు వస్తున్నాయి. కానీ, ఓజీ మేనియా చూస్తుంటే దేశ, విదేశాల్లో పవర్ స్టామినా నిరూపించేలా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓజీ మూవీ ఫస్ట్ డే (సెప్టెంబర్ 25న) రూ.150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం కన్ఫామ్ అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే, ఈ మూవీ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.75 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే బుకింగ్స్ అన్నిటీనీ కలుపుకుని రూ.75 కోట్లుదాకా వచ్చినట్లు టాక్. ఇక ఈ లెక్కన చూసుకుంటే.. ఓజీ మూవీ ఈజీగా రూ.150 కోట్లకి పైగా గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా లెక్కగట్టాయి.
అయితే, హరిహరవీరమల్లు సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, పవన్ కల్యాణ్ అభిమానులు OG సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో థియేటర్లో తమ ఫ్యానిజం చూపిస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. సుజీత్ ఇచ్చిన హై ఎలివేషన్స్కి.. ఓజీతో పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని డిసైడ్ అయిపోయారు. అలాగే, బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్, వెబ్ సైట్స్లో OG అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ అంశాల దృష్ట్యా OG తొలిరోజు రూ.150 నుంచి 200 కోట్ల వరకు సాధిస్తుందని బలంగా నమ్ముతారు.
ఓజీ బడ్జెట్:
పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ భారీ బడ్జెట్తో తెరకెక్కింది. సుజీత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సుమారు రూ.250 కోట్లతో నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంక మోహన్ తోపాటు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, ఉపేంద్ర, అర్జున్ దాస్ లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు.
ఓజీ బిజినెస్ & టార్గెట్:
పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్గా నటించిన ‘ఓజీ’ వరల్డ్‌వైడ్ థియేటరికల్ రైట్స్ భారీగా జరుపుకుంది. సుమారు రూ.193.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్లో మొత్తం థియేట్రికల్ రైట్స్ రూ.102 కోట్లు, నైజాంలో రూ.55 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ.157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు వెల్లడించాయి.
ఈ క్రమంలో మూవీ బ్రేక్ ఈవెన్ చేయాలంటే.. దాదాపు రూ. 200 కోట్ల షేర్.. రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
థియేట్రికల్ బిజినెస్:
ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లు,
సీడెడ్‌లో రూ.22 కోట్లు,
నైజాం రైట్స్ రూ.55 కోట్లు,
తెలుగు రాష్ట్రాల్లో= రూ.157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ జరిగింది.
కర్ణాటక, కేరళ, తమిళనాడు హక్కులు రూ.11 కోట్లు
నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్= 2.9 మిలియన్ డాలర్లు అంటే..రూ.25.5 కోట్ల రూపాయల మేర జరిగింది.
యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాలు రూ.157కోట్లు, + కర్ణాటక, కేరళ, తమిళనాడు రూ.11కోట్లు, + ఓవర్సీస్ రూ.25.5కోట్లు, బిజినెస్ లెక్కలు కలుపుకుంటే = వరల్డ్‌వైడ్గా ఓజీ సుమారు రూ.193.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.