ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వానికి పవన్ సూచనలు

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వానికి పవన్ సూచనలు

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు, తెలంగాణ ప్రభుత్వంల మధ్యం విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో వారిని విధులు నుంచి తొలగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునిల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాత్కాలిక పద్దతిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్ల నియామకం కోసం నోటీఫికేషన్ విడుదల చేసేలా చర్చలు జరుగుతున్నాయి . అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పవన్ కల్యాణ్ స్పందించారు. కార్మికుల డిమాండ్లను సానుభూతితో పరిష్కరించాలన్న పవన్ … సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు 17 రోజుల పాటు సమ్మె చేసి ఉద్యమానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.  ప్రజలకు కష్టం కలగకుండా కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.