ఎవరికి ఓటు వేసానో చెప్పడం ఓటర్లపై ప్రభావితం పడుతుంది

V6 Velugu Posted on Oct 10, 2021

నటుడు పవన్‌కల్యాణ్‌ 'MAA' ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని, రాజకీయాలపై 'మా' ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. MAA  ఎన్నికల్లో తిప్పికొడితే 900 ఓట్లు ఉంటాయన్నారు. సినిమాలు చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలన్నారు. వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా ఉంటాయన్న పవన్..వ్యక్తుల వ్యాఖ్యలతో సినీ రంగానికి సంబంధం ఉండదన్నారు. మా ఎన్నికలు సున్నితంగా, ఏకగ్రీవంగా జరగాల్సిందన్న ఆయన..చాలాసార్లు ఓటేసినా.. ఈ స్థాయి ఎన్నికలు చూడలేదన్నారు.
 

Tagged Pawan kalyan, telling , vote affect voters

Latest Videos

Subscribe Now

More News