
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో ఆదివారం రాత్రి ఉన్నట్టుండి వర్షం మొదలైంది. దీంతో.. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న OG ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షంలోనే కొనసాగుతోంది. ఈవెంట్కు భారీగా తరలివెళ్లిన అభిమానులు వర్షం కారణంగా ఇబ్బందిపడ్డారు. ఇక.. హైదరాబాద్ సిటీలో వర్షం విషయానికొస్తే.. మీర్ పేట్, జిల్లెల్లగూడ, బాలాపూర్ పరిసర ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఉప్పల్ ,బోడుప్పల్, పిర్జాదిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది.
రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, రాంగోపాల్ పేట్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట, మారేడు పల్లి, సికింద్రాబాద్, జేబీస్, కార్ఖానా, తిరుమల గిరి, బోయిన్ పల్లిలో వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, మీర్ పేట్, జిల్లెల్లగూడ, బాలాపూర్ పరిసర ప్రాంతాలలో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, మల్లంపేట్, బహుదూర్ పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారంలో వర్షం పడింది.