OG Release Delay: ఓవర్సీస్ ఫ్యాన్స్‌కు 'OG' షాక్.. మొదటి రోజే షోస్ క్యాన్సిల్..!

OG Release Delay:  ఓవర్సీస్ ఫ్యాన్స్‌కు 'OG' షాక్.. మొదటి రోజే షోస్ క్యాన్సిల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ' OG '.  యంగ్ అండ్ టాలెండెట్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  ఈ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పవర్ స్టార్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తొలిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. థమన్ సంగీతం అందించారు. దీంతో అంచనాలు మరింత పెంచాయి. ఈ కాంబో పవన్ స్టార్ కు కచ్చితంగా గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. 

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలను మించి పోయాయి. ఈ సారి పవన్ పక్కాగా హీట్ కొట్టేస్తాడంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు 2.11 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే, ఈ కలెక్షన్స్ ఇంకాస్త ఎక్కువగా ఉండేవి.  కానీ సుమారు 80,000 డాలర్ల ఆదాయం USA సర్క్యూట్‌లో తగ్గే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ డెలివరీలో జరిగిన ఆలస్యం కావడమే అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. అమెరికాలోని ప్రముఖ సినిమా చైన్‌లలో ఒకటైన AMC, కంటెంట్ సకాలంలో అందకపోవడంతో షోలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఓవర్సీస్ లో పెద్ద సినిమా చైన్‌లు రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే కంటెంట్ తమ వద్ద ఉండాలని నిబంధనలు ఉన్నాయి. గతంలో రాజమౌళి ‘RRR’ మాత్రమే ఈ నిబంధనను సక్రమంగా పాటించి, కంటెంట్‌ను ముందుగానే థియేటర్లకు అందించింది. కానీ దురదృష్టవశాత్తు, ‘OG’ విషయంలో ఇది జరిగింది. దీని ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. కెనడాలోని ప్రముఖ సినిమా చైన్ కూడా ఈ ఆలస్యం కారణంగా షోలను రద్దు చేశాయి. దీంతో అక్కడ దాదాపు 160,000 డాలర్ల ఆదాయం నష్టపోయిందని సమాచారం..

మరోవైపు నార్త్ అమెరికాలో ‘OG’ తమిళ వెర్షన్ కూడా రద్దయింది. ఇప్పుడు ఈ సినిమా కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే విడుదల కానుంది. డిస్ట్రిబ్యూటర్లు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి సగం కంటెంట్ సోమవారం రాత్రి ఆలస్యంగా అందింది. రెండో సగం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఈ ఉదయం వరకు కూడా రెండో సగం కంటెంట్ రాలేదు. దీంతో స్క్రీనింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అభిమానులు అందోళన చెందుతున్నారు.

 

వాస్తవానికి, ‘OG’ సినిమా ప్రారంభం నుంచే ఆలస్యం జరుగుతూ వస్తోంది. 2023లో మొదలైన షూటింగ్ 2025లో రిలీజ్‌కు సిద్ధమైంది. సినిమా టీజర్, ట్రైలర్ విడుదల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. మొదట 21వ తేదీ ఉదయం విడుదల కావాల్సిన ట్రైలర్  ఆలస్యంగా..  అదే రోజు సాయంత్రం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చూపించారు. అయితే అది ఇంటర్నెట్‌లోకి మాత్రం మరుసటి రోజునే వచ్చింది.

 

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటించింది.  బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు . ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో నటించగా, నటి శ్రియా రెడ్డి  ఒక పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందించారు.  డీవీవీ దానయ్య నిర్మాణంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.