
చాలా రోజుల తర్వాత దీపావళికి మెగా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కనువిందు చేసింది. అయితే ఈ సారి మెగా ఫ్యామిలీలో జరిగిన దీపావళి వేడుకలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో పాల్గొని సరదగా గడపడం విశేషం.
పవన్ తన భార్య అన్నాలెజినోవా తన కొడుకులు అఖిరానందన్, మార్క్ శంకర్ పవనోవిచ్ కూతుళ్లు ఆధ్యా , పోలెనా అంజనా పవనోవాతో కలిసి తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ అన్నయ్య చిరంజీవి ,నాగబాబు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి అంజనా దేవీ, వదిన సురేఖతో కలిసి సరదా గడిపారు. ఫ్యామీలీ ఫోటో దిగారు. మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.