పేటీఎం–ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రూపే క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పేటీఎం–ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రూపే క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కన్జూమర్లకు వివిధ ఆఫర్లను ప్రకటించిన కంపెనీలు

న్యూఢిల్లీ: ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి రూపే నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ కింద కో–బ్రాండెడ్ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులను పేటీఎం లాంచ్ చేసింది. ఈ  కార్డులు పేటీఎం ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డు బ్రాండ్ కింద వచ్చాయి. 2020 నుంచే ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డుతో తమకు పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఉందని, తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఐ)తో కలిసి రూపే కింద కార్డులను లాంచ్ చేశామని పేటీఎం ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. దేశ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త రివల్యూషన్ రానుందని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. యూజర్ల పేమెంట్ ఛాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రెడిట్ ఇక నుంచి ముందుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డుతో కలిసి, పేటీఎం తెచ్చిన రూపే క్రెడిట్ కార్డులు  కన్జూమర్లకు చాలా మేలు చేస్తాయి. మా యూజర్లు క్యూఆర్ కోడ్ పేమెంట్లలో ఆరితేరారు. యూపీఐ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేసే రూపే క్రెడిట్ కార్డులతో ఫోన్ల నుంచే జరిపే ట్రాన్సాక్షన్లు మరింత విస్తరిస్తాయి. డిజిటల్ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త శకం మొదలవుతుంది’ అని వివరించారు.

ఈ క్రెడిట్ కార్డులతో  పేటీఎంలో చేసే ట్రాన్సాక్షన్లపై 2 శాతం క్యాష్​ వస్తుందని, ఇతర ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో చేసే ట్రాన్సాక్షన్లపై ఒక శాతం క్యాష్ బ్యాక్ వస్తుందని పేటీఎం వెల్లడించింది. వాలెట్లను రీలోడ్ చేసుకోవడానికి, ఫ్యూయల్ ఖర్చులపై మాత్రం ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదని తెలిపింది. పేటీఎం రూపే కార్డు హోల్డర్లు ఒక శాతం ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛార్జీ మినహాయింపు పొందుతారని, ప్లాటినం కార్డ్ హోల్డర్లు అయితే రూ. లక్ష  సైబర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ పొందుతారని తెలిపింది. వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కస్టమర్లు రూ.75 వేల విలువైన వివిధ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కించుకుంటారని, ఓటీటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లయిట్ టికెట్లు వంటివి పొందుతారని వెల్లడించింది. డిజిటల్ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన ఉన్న యంగ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని  పేటీఎంతో కలిసి ఈ కార్డును లాంచ్ చేశామని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ రామ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు.