ఫ్రీ సిలిండర్ ఆఫర్ పొడిగించిన పేటీఎం

ఫ్రీ సిలిండర్ ఆఫర్ పొడిగించిన పేటీఎం
  • జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం

న్యూఢిల్లీ: మొదటిసారి తమ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే కస్టమర్లకు అందిస్తున్న క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పేటీఎం పొడిగించింది. దీంతో పేటీఎం వినియోగదారులు జూన్ 30 వరకు తాము బుక్ చేసే ఎల్పీజీ సిలిండర్లపై క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో వినియోగదారులు రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశముంటుంది. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు రూ. 800 నుంచి 850 మధ్యలో ఉండగా.. ఈ క్యాష్ బ్యాక్‌తో వినియోగదారులు తమ సిలిండర్‌ను ఉచితంగా పొందినట్లు అవుతుంది. తొలుత ఈ ఆఫర్‌ను మే 31 వరకే అని ప్రకటించిన పేటీఎం.. దాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఉచితంగా సిలిండర్‌ను పొందడం ఎలాగంటే..

  • ఈ ఆఫర్‌ను అందుకోవాలంటే.. వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌లో పేటీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  • తర్వాత ‘బుక్ గ్యాస్ సిలిండర్’ సెక్షన్‌కి వెళ్లి తమ డీలర్ షిప్‌ను ఎంచుకోవాలి. (భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ లాంటివి). 
  • అనంతరం గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జూమర్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి బుకింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలి.
  • బుకింగ్ చేసేముందు రూ. 800 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఎంచుకోవాలి. మొదటిసారి బుక్ చేసే కస్టమర్లకు ఇది ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది. ఆ తర్వాత పేమెంట్ చేసిన 48 గంటల్లోగా ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది. 
  • ఆ స్క్రాచ్ కార్డును గీకితే ఈ ఆఫర్లో భాగంగా మీరు ఎంత గెలుపొందారో తెలుసుకోవచ్చు. ఈ స్క్రాచ్ కార్డును ఏడు రోజుల్లోగా గీకాల్సి ఉంటుంది. లేకపోతే ఆఫర్ బెనిఫిట్స్ పొందలేరు.
  • ఈ ఆఫర్ రూ. 500, ఆపైన జరిపే బుకింగ్ చెల్లింపులపై మాత్రమే వర్తిస్తుంది. ఆఫర్ చెల్లుబాటు కాలంలో వినియోగదారులు ఒక్కసారే మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.