పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్

పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్టయ్యారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ అనంతరం ఆయన బెయిల్ పై విడుదలైనట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఫిబ్రవరి 22నమదర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సమీపంలో విజయ్ శేఖర్ తన ల్యాండ్ రోవర్ కారుతో డీసీపీ బెనిటా మేరీ జాకర్ కారును ఢీకొట్టారు. అనంతరం అక్కడ ఆగకుండా వెళ్లిపోయారు. డీసీపీ కారు డ్రైవర్ ల్యాండ్ రోవర్ కారు నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. నెంబర్ ఆధారంగా పోలీసులు కారును పేటీఎం సీఈఓ విజయ్ శంకర్ శర్మదిగా గుర్తించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి విజయ్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనను విడిచిపెట్టారు.

For more news..

కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను

దేశ భద్రతపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం