
ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లోకి చేరగా...మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
మరోవైపు ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే ఛాన్సుంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఈ మ్యాచులో ఢిల్లీ ఓడినా..గెలిచినా ప్రయోజనం ఉండదు. దీంతో పంజాబ్ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అథర్వ తైదే, సామ్ కర్రాన్, షారూఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. రబాడా, నాథన్ ఎల్లీస్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలే రోసో, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే, యశ్ ధుల్, కుల్దీప్ యాదవ్.