కేబినెట్‌‌‌‌‌‌‌‌ విస్తరణలో మైనార్టీకి చోటు..బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం: మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ గౌడ్

కేబినెట్‌‌‌‌‌‌‌‌ విస్తరణలో మైనార్టీకి చోటు..బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం: మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ గౌడ్
  •     బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ లోపాయికారి ఒప్పందంతో అడ్డంకులు
  •     కేసీఆర్​ హయాంలో కనీవిని ఎరుగని అవినీతి.. కవిత కామెంట్లే ఇందుకు సాక్ష్యం

నిజామాబాద్, వెలుగు:  రాష్ట్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌ విస్తరణ ఎప్పుడు జరిగినా మైనార్టీ నేతకు చోటు లభిస్తుందని  పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్​గౌడ్​తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో పార్టీ నుంచి మైనార్టీ నేత గెలిచి ఉంటే మొదటి విడతలోనే కేబినెట్‌‌‌‌‌‌‌‌​అవకాశం ఉండేదని, డిసెంబర్​, జనవరిలో ఎప్పుడు విస్తరణ జరిగినా మైనార్టీకి చాన్స్​దక్కుతుందన్నారు.  గురువారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కేంద్రంలో మహేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్​ పలు అభివృద్ధి పనులను  ప్రారంభించారు. 

అనంతరం ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్​ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అమేర్​​అలీఖాన్​ను ఎమ్మెల్సీగా నియమిస్తే.. జీర్ణించుకోలేని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ కోర్టుకు వెళ్లి అడ్డుకున్నదని, ఆ స్థానాన్ని అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌తో భర్తీ చేశామన్నారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్​దండుపాళ్యం బ్యాచ్ అరాచక పాలనను ప్రజలు మరువలేదని, మరో పదేండ్లదాకా మరువరని అన్నారు. 

మళ్లీ లేస్తామనే ఆశలు అసలే పెట్టుకోవద్దని బీఆర్ఎస్​ నేతలకు సూచించారు. గులాబీ పార్టీని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి.. పార్లమెంట్​ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌లో సున్నా చేశారని ఎద్దేవా చేశారు.  దేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ జరగని అవినీతి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలో జరిగిందని, కేసీఆర్​కూతురు కవిత కామెంట్లే దానికి బలం చేకూరుస్తున్నాయన్నారు. 

కవిత ప్రశ్నలకు కేటీఆర్​ ఇప్పటి దాకా జవాబు చెప్పలేదన్నారు. కుటుంబ తగాదాలు తీర్చుకోలేని దైన్యస్థితిలో ఉన్న కేటీఆర్..​ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్​రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా పసలేని చౌకబారు ఆరోపణలు మానుకోవాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హితవు పలికారు. అవినీతి గురించి కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు, కవిత మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు. పదేండ్ల దోపిడీ పాలనలో భాగస్వామిగా ఉన్న కవిత.. ఇప్పుడు పాదయాత్రలు చేస్తే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. 

ఎంపీ అర్వింద్​ ఏ లెక్కలతో మాట్లాడారో?

 నిజామాబాద్​ జిల్లాలో ఆర్వోబీ నిర్మాణలకు సెంట్రల్​ గవర్నమెంట్​ ఫండ్స్​ ఆగిపోయాయని తాను చేసిన కామెంట్‌‌‌‌‌‌‌‌కు కట్టుబడి ఉన్నట్టు మహేశ్‌‌‌‌‌‌‌‌​కుమార్​గౌడ్​ తెలిపారు. ఎంపీ అర్వింద్​ ఏ లెక్కలతో మాట్లాడారో తనకు తెల్వదని అన్నారు. స్టేట్ వాటా నిధులు  ఆగి ఉండొచ్చుకానీ, సెంట్రల్​ గవర్నమెంట్​ ఫండ్స్​​కూడా ​పెండింగ్​లో ఉన్నాయన్నారు. సైటెర్లు వేయడం తనకు కూడా తెలుసన్నారు.

 సికింద్రాబాద్​నుంచి నిజామాబాద్​ మీదుగా -ముంబై వరకు డబుల్​ రైల్వే లైన్​ కోసం కృషి చేయాలని ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు. హ్యామ్​ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద నిజామాబాద్​ జిల్లాలో టెంపుల్​ కారిడార్ రోడ్ నిర్మాణానికి రూ.380 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు.  ధర్మపురి, వేములవాడ, రుద్రంగి, మానాల, రాహత్​నగర్​, మోర్తాడ్​, నందిపేట, బాసర దాకా కొత్త రోడ్​ నిర్మించబోతున్నట్టు చెప్పారు. 

ఇది పూర్తయితే కరీంనగర్​–నిజామాబాద్​మధ్య దూరం 30 కిలోమీటర్లు తగ్గుతుందన్నారు. లింబాద్రిగుట్టలో రూ.3.50 కోట్లతో గెస్ట్​హౌస్‌‌‌‌‌‌‌‌​ నిర్మాణానికి ఎకరం ఎండోమెంట్​ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ను టూరిజం శాఖకు ట్రాన్స్​ఫర్​ చేశామని తెలిపారు. కాగా.. పార్టీ ఫిరాయింపులపై కామెంట్​ చేస్తున్న కేటీఆర్.. ​ ​ 2014లో జూబ్లీహిల్స్​ నుంచి మాగంటి గోపీనాథ్​ ఏ పార్టీ నుంచి గెలిచాడో చెప్పాలని గవర్నమెంట్​ సలహాదారు షబ్బీర్​అలీ ప్రశ్నించారు. టీడీపీ నుంచి గెలిచిన మాగంటిని  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్​ చేర్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.  

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో గెలుస్తం

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో పేదలు నివసించే కాలనీలే ఎక్కువని, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలో అక్కడ సమస్యలు పేరుకుపోయాయని మహేశ్ గౌడ్​ ​అన్నారు. పదేండ్లలో అభివృద్ధిని పట్టించుకోని బీఆర్​ఎస్​ను అక్కడి ప్రజలు ఆదరించడం లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​యాదవ్‌‌‌‌‌‌‌‌ 50 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో నన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్​ స్కీమ్​పట్ల ఆదరణ కనిపిస్తున్నదని, సమర్థుడిని పోటీకి దింపడం కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.