కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది బాధ్యతారాహిత్యం..పాశమైలారంలో అంతపెద్ద ప్రమాదం జరిగితే కన్నెత్తి చూడలేదు: మహేశ్ గౌడ్ 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది బాధ్యతారాహిత్యం..పాశమైలారంలో అంతపెద్ద ప్రమాదం జరిగితే కన్నెత్తి చూడలేదు: మహేశ్ గౌడ్ 
  • బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించలేదని మండిపాటు
  • కవిత ఏ ముఖం పెట్టుకొని ఖర్గేకు లేఖ రాశారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో అంత పెద్ద ఘోర ప్రమాదం జరిగి, పలువురు చనిపోతే.. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శించారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల తీరు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉందని, అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు లేఖ రాసిందని ప్రశ్నించారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను ఎందుకు తగ్గించారని ఆమెను నిలదీశారు. పదేండ్లు అధికారం అనుభవించినప్పుడు ఎంత మంది బీసీలకు ఉద్యోగాలిచ్చారని చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉసురు తగిలి అధికారం కోల్పోయింది నిజం కాదా అని అన్నారు. అసలు కవితకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉందా, ఆమె బీఆర్ఎస్ నుంచా లేక జాగృతి తరఫున ఖర్గేకు లేఖ రాశారా అని ప్రశ్నించారు. ఇంట్లోని ఆస్తుల గొడవ బయటపడడంతో అన్నా.. చెల్లెలు ఎవరికి వారే ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కవిత ఏ రోకో చేసినా ఫర్వాలేదు, ముందు పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో చెప్పిన తర్వాత రైల్ రోకో చేయాలన్నారు. 

సీఎం సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధమా..?

బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు సిద్ధమా అని మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు. ఆనాడు ఏపీ పెద్దలతో కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది మీరు కాదా, రోజా ఇంట్లో చేపల పులుసు తిని నీటి వాటా విషయంలో రాజీ పడింది మీరు కాదా అని నిలదీశారు. బనకచర్ల విషయంలో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించలేని స్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు.

కేసీఆర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. ఆధారాల్లేకుండా ఏదిపడితే అది మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో పార్టీ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని, అనిరుధ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.