ఇందిరా ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ఫూర్తి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఇందిరా ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ఫూర్తి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ఫూర్తి అని పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్ అన్నారు. ఇందిర పేరుతో తెలంగాణలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ నాయకత్వంలో అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయంలో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గురువారం ఇందిరా జయంతి సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.