‘‘నీ భార్య గర్భవతి అయితే.. బస్సు తెచ్చుకుని నడుపుకో..’’ ప్రయాణికుడిపై విరుచుకుపడిన ఆర్టీసీ డ్రైవర్

‘‘నీ భార్య గర్భవతి అయితే.. బస్సు తెచ్చుకుని నడుపుకో..’’ ప్రయాణికుడిపై విరుచుకుపడిన ఆర్టీసీ డ్రైవర్

కోఠి, వెలుగు: ఎంజీబీఎస్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ దురుసు ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటన వారం కింద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్లే బస్సులో ఓ ప్రయాణికుడు గర్భవతి అయిన తన భార్యతో కలిసి ఎక్కాడు. అయితే, స్పీడ్​బ్రేకర్ల వద్ద వేగంగా పోనిస్తుండడంతో తన భార్య ఐదు నెలల గర్భిణి అని, బస్సును జాగ్రత్తగా నడపాలని డ్రైవర్ను కోరాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు డ్రైవర్​‘నీ భార్య గర్భవతిగా ఉంటే నువ్వే ఓ బస్సు తెచ్చుకుని నడుపుకో’ అని పరుషంగా మాట్లాడాడు. మర్యాదగా మాట్లాడాలని బాధితుడు కోరినా డ్రైవర్​పట్టించుకోలేదు. పక్కనే ఉన్న వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా తీరు మారలేదు. ఈ ఘటన మొత్తాన్ని ఓ బాధిత ప్రయాణికుడు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియో తీసి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలో పోస్టు చేయడంతో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారడంతో డ్రైవర్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.