కమీషన్లు ఫిక్స్ కాకనే కేంద్ర నిధులను మురగబెడుతున్నరు : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

కమీషన్లు ఫిక్స్ కాకనే కేంద్ర నిధులను మురగబెడుతున్నరు : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: కమీషన్లు ఫిక్స్ కాకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కారు వినియోగించుకోకుండా మురగబెడుతోందని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా భారత్‌‌‌‌పై విషం చిమ్ముతున్నారని తెలిపారు.

విదేశీ వ్యక్తులను తీసుకువచ్చి దేశాన్ని అవమానించేలా మాట్లాడిస్తున్నారనీ, అలా మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఫెడరల్ వ్యవస్థను బలంగా నమ్ముతుందన్నారు. తెలంగాణకు అన్ని విషయాల్లో అండగా ఉంటామని పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. మరి కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా తెలంగాణకు సహకరిస్తామని హామీ ఇచ్చిందా? అని ఆయన నిలదీశారు.