సీపీఐ మద్దతు నాకు కొండంత బలం..కూనంనేనితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ

సీపీఐ మద్దతు నాకు కొండంత బలం..కూనంనేనితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని మగ్దూం భవన్‌‌‌‌లో కూనంనేనితో పాటు పలువురు సీపీఐ సీనియర్ నాయకులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మిత్రపక్షమైన సీపీఐ మద్దతు తనకు మరింత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం సీపీఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు ఈ ఎన్నికల్లో మరింత బలంగా ప్రతిబింబిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో, సీపీఐతో కలిసి పట్టభద్రుల ప్రయోజనాలను కాపాడటమే తన ప్రథమ ప్రాధాన్యత అని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.