ఏసీబీ వలలో టోలీచౌకి సీఐ.. రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిన రమేశ్ నాయక్

ఏసీబీ వలలో టోలీచౌకి సీఐ.. రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిన రమేశ్ నాయక్

మెహదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌‌లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్‌‌స్పెక్టర్ టి. రమేష్ నాయక్ బుధవారం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుబడ్డారు. ఒక ఫిర్యాదుదారుడి నుంచి ఆయన ఈ నగదును డిమాండ్ చేసి తీసుకుంటుండగా.. అధికారులు పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి సమాచారంతో కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం రమేష్ నాయక్‌‌ను పట్టుకుంది. సీఐ దగ్గర రూ. 20 వేల నగదు, లెక్కల్లో చూపని రూ. 50వేలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, టోలిచౌకి పోలీస్ స్టేషన్‌‌లో సోదాలు నిర్వహించారు.