ముందు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఫాంహౌస్ నుంచి బయటకు రమ్మను..ఆ తర్వాత కాంగ్రెస్ నేతల గురించి  మాట్లాడు: పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌గౌడ్

ముందు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఫాంహౌస్ నుంచి బయటకు రమ్మను..ఆ తర్వాత కాంగ్రెస్ నేతల గురించి  మాట్లాడు: పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌గౌడ్
  • బీఆర్ఎస్ ఎత్తేసిన ధర్నా చౌక్‌‌‌‌లో కేటీఆర్ ధర్నా చేశాడంటే అది కాంగ్రెస్ కల్పించిన అవకాశమే 
  • ధర్నా చౌక్‌‌‌‌లో ముక్కు నేలకు రాస్తే వారి ఆత్మకు శాంతి కలిగేదని కామెంట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్‌‌‌‌ నేతలు ఢిల్లీకి ఎందుకు పోలేందంటూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నిస్తున్నారని, ఎప్పుడు ఎక్కడికెళ్లాలో తమకు తెలుసునని పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్​ పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. ముందు మీ నాన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఫాంహౌస్​ వదిలి బయటకు రమ్మను” అని డిమాండ్​ చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఆయ మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కొడంగల్‌‌‌‌లో నిరసన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అసలు తమ నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోలేదో ముందు దానికి  సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ఎత్తేసిన ధర్నా చౌక్​ను తిరిగి కాంగ్రెస్ ఓపెన్ చేస్తేనే.. ఇప్పుడు కేటీఆర్ అక్కడ ధర్నా చేస్తున్నాడని, అది కాంగ్రెస్ కల్పించిన అవకాశం అనేది గుర్తుంచుకోవాలని 
చురకలంటించారు. 

నల్ల చొక్కా నాటకాలను జనం నమ్మరు

పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ నల్ల  చొక్కా వేసుకొని నాటకాలు ఆడితే తెలంగాణ ప్రజులు నమ్మరని మహేశ్‌‌‌‌గౌడ్ ​వ్యాఖ్యానించారు. వయసు మీదపడినా కాంగ్రెస్  జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలాంటి వారు ఢిల్లీ వీధుల్లో విద్యార్థుల తరఫున పోరాడితే.. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ లో రెస్ట్‌‌‌‌ తీసుకుంటున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్‌‌‌‌ పాలనలో గ్లోబరీనా సంస్థ వల్ల ​27 మంది ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు సూసైడ్​ చేసుకుంటే ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. త్వరలోనే గ్లోబరీనా సంస్థపై నివేదికను బయట పెట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన లీక్‌‌‌‌లపై కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, ఆ లీకుల కేసులు ఎందుకు మరుగున పడ్డాయని ఫైర్ అయ్యారు. ఆ లీకుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల గురించి, వారి తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడలేదని, ధర్నా చౌక్​లో ఆ కుటుంబాలకు క్షమాపణలు కోరి, ముక్కు నేలకు రాస్తే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల ఆత్మలకు శాంతి కలిగేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్లు మూలుగుతున్నాయని, ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబానికి 2 కోట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకులతో కేటీఆర్‌‌కు సంబంధం?

బీజేపీతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కు ఉన్న లోపాయికారి ఒప్పందంతోనే ఇంతకాలం కేటీఆర్ మౌనంగా ఉండి, ఇప్పుడు ధర్నాకు వచ్చారని, జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీక్‌‌‌‌లతో కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు సంబంధం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని మహేశ్ గౌడ్​అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్‌‌‌‌ గాంధీకి పెద్ద ఎత్తున ఆదరణ వస్తుండడంతో మోదీతో కుట్రపన్నిన బీఆర్ఎస్.. బట్టకాల్చి మీద వేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ డ్రామాలో విద్యార్థులు భాగం కావద్దని కోరారు. విద్యార్థుల తరఫున రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కూడా జిల్లా స్థాయిలో ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావంగా పీసీసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలు ఉంటాయని చెప్పారు.

సర్​పై జూమ్ మీటింగ్‌‌

సర్ ప్రక్రియకు ఆగస్టు 3 వరకు టైమ్ ఉన్నప్పటికీ, ఈ నెల 30 వరకే ప్రజలు ఓట్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్‌‌ గౌడ్ సూచించారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌‌లో కాంగ్రెస్ ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌‌చార్జులు పాల్గొన్నారు. మహేశ్​ గౌడ్​ మాట్లాడుతూ.. ఓటర్లలో చాలామంది ప్రాపర్ ఐడీ ప్రూఫ్స్ సబ్మిట్ చేయకపోవ డంతో అర్హులైనవారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీఎల్‌‌ఏలు, బీఎల్‌‌వోలను కోఆర్డినేట్ చేస్తూ ఓట్లు డిలీట్ కాకుండా చూడాలని సూచించారు.