మంచిర్యాల జిల్లా నస్పూర్లోని లక్ష్మి గణపతి శివ మార్కండేయ మహా దుర్గా దేవాలయంలో నిర్వహించిన శ్రీ శాకంబరి యుక్త వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి తొమ్మిది రోజులుపాటు కుంకుమార్చన, మహా కుంకుమాభిషేకం, కుంకుమ పూజలు చేశారు. శుక్రవారం ఆలయ అర్చకులు చండీ హోమం నిర్వచించారు.
మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ దంపతులు, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఆలయ కమిటీ, నస్పూర్ పద్మశాలి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వెలుగు, నస్పూర్
