చెన్నూరులోని మధున పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు

చెన్నూరులోని మధున పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మధున పోచమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించినట్లు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి.సుదర్శన్ తెలిపారు. గత ఆరు నెలలుగా భక్తులు హుండీలో మొత్తం రూ.4,99,766 సమర్పించినట్లు వెల్లడించారు. 

లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, పూజారులు, పోలీసు సిబ్బంది, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.