పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు సిద్ధమా? : మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్ సవాల్‌‌‌‌‌‌‌‌

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు సిద్ధమా? : మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్ సవాల్‌‌‌‌‌‌‌‌
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్ సవాల్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగకుంటే ఏ విచారణకైన సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయాలని బీఆర్ఎస్ నేతలకు గురువారం ఒక ప్రకటనలో సవాల్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ పార్టీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే సీఐడీ విచారణ లేదంటే జ్యూడీషియల్ విచారణ జరిపించేందుకు సీఎంకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థలతో విచారణకు సిద్ధమైతే ఆ ప్రాజెక్టులో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో బయటపడుతుందని, తమ నిజాయితీ నిరూపించుకునేందుకు కేటీఆర్ ఈ విచారణకు సిద్ధం కావాలన్నారు.

 గతంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని అప్పుడు ఆధారాలతో సహా కోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయననే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేర్చుకొని ఆ కేసును నీరుగార్చేలా చేశారన్నారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరిన నాగం, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ఎలా కొట్లాడగలరని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పుతో తామంతా నీతిమంతులమని, చేసిన అవినీతి మాయమైనట్లు కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.