రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు.. ఈసీకి పీసీసీ కంప్లయింట్

రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు.. ఈసీకి పీసీసీ కంప్లయింట్

రైతుబంధు నిధులను కేసీఆర్ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు  చెల్లిస్తున్నారని  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు  కంప్లైంట్ చేశారు.   రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్, పొంగులేటి, మధుయాష్కి బీఆర్కే భవన్ లో వికాస్ రాజ్ తో భేటీ అయ్యారు.  మొత్తం 4 అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

 భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన   ఉత్తమ్ కుమార్ రెడ్డి..బీఆర్ఎస్ ప్రభుత్వానికి.. సీఎం కేసీఆర్ కు ఎలాంటి అధికారం లేకపోయినా.. నిబంధనలకు విరుద్ధంగా.. ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని అన్నారు.     6 వేల కోట్ల రైతుబంధు నిధులను మళ్లిస్తున్నట్లు చెప్పారు.  రెండు , మూడు రోజులుగా అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని కంప్లైంట్ చేశారు.  భూ రికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు ఉత్తమ్. 

 రంగారెడ్డి,సంగారెడ్డి,  మేడ్చల్  జిల్లాలోని అసైన్డ్  ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్.  చివరి రోజుల్లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.  ప్రభుత్వ ట్రాన్సక్షన్ పై నిఘా పెట్టాలని సీఈసీవో వికాస్ రాజ్ ను ని  కోరామన్నారు ఉత్తమ్.