అసోం సీఎంపై రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

అసోం సీఎంపై రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 
  • అసోం సీఎంపై రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 
  • తెలంగాణ ఇచ్చిన సోనియాకే ఇంత ఘోర అవమానామా 

హైదరాబాద్ : అసోం సీఎంపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే అన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వశర్మపై సోమవారం రేవంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడిన రేవంత్.. మహిళలను అవమానించేలా మాట్లాడిన హిమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ 12 గంటల లోపు అసోం సీఎంను అరెస్ట్ చేయాలన్న రేవంత్ రెడ్డి.. సీఎం ఒత్తిడి చేయకుంటే పోలీసులు FIRలు నమోదు చేస్తారన్నారు. ఫిబ్రవరి 11 న అస్సాం సీఎం హేమంత బిశ్వా శర్మ.. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉన్న హేమంత బిశ్వశర్మ అలా మాట్లాడ్డం సిగ్గు చేటు  అన్నారు. ఆ రాష్ట్ర డీజీపీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ రాసి పంపిస్తారని అనుకున్నాం కానీ  అలా జరగలేదన్నారు.  వెంటనే హేమంత బిశ్వా పై క్రిమినల్ కేసు నమోదు చేసి, సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. హేమంత కామెంట్స్ ను కేంద్రం సీరియస్ గా తీసుకొని దేశ సంస్కృతీ ని కాపాడుతుందని అనుకున్నామని..అలా చేయకపోవడంతో మేము ఇవ్వాళ తెలంగాణలోని అన్ని పీఎస్ లలో ఫిర్యాదు చేస్తున్నామన్నారు.  ఇది ఒక సోనియాకు జరిగిన అవమానమే కాదు.. దేశంలోని మాతృమూత్రులకు జరిగిన అవమాన అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకే ఎంత ఘోర అవమానామా అన్నారు. సోనియా పార్టీలో ఉన్న మేము ఊరుకోలేక పిర్యాదు చేశామని చెప్పారు. కేసీఆర్.. రెండు రోజులుగా గట్టిగా మాట్లాడుతున్నాడని..కేసీఆర్ పోలీసులపై ఒత్తిడి చేయకు.. వాళ్ళు కేసు నమోదు చేసి హేమంత బిశ్వాను అరెస్ట్ చేస్తారన్నారు. పోలీసులు అస్సాం సీఎంకు నోటీసులు ఇస్తారన్నారు.

ఆయన నోటీసులు తీసుకోకుంటే.. తెలంగాణ పోలీస్ టీం.. వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలన్నారు. అవసరమైతే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాన్న రేవంత్..న్యాయ సలహా తీసుకొని ఇలాంటి కామెంట్స్ చేసే వారిపై ఎలాంటి చర్యలు, కేసులు పెట్టాలో ఆలోచన చేయండన్నారు. 48గంటల పాటు చూస్తాం.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు. ఎస్పీ కార్యాలయాల ముందు, పోలీస్ కమిషనరేట్ ల ముందు ఆందోళన చేస్తామని తెలిపిన రేవంత్..ఈనెల 16న 12 గంటలకు ముట్టడిలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే సమీక్ష చేయాలన్నారు. చట్టం పరంగా చర్యలు చేపట్టాలన్న ఆయన..పోలీస్ , సర్కార్ నుండి స్పందన రాకుంటే.. ముట్టడిలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని..18న మహిళా నేతల ఆధ్వర్యంలో న్యాయపోరాటం, వీధిపోరాటం చేస్తామన్నారు. క్షమించరాని నేరం హేమంత బిశ్వా శర్మ చేశారన్నారు.