అమిత్షాకు రేవంత్ రెడ్డి లేఖ

V6 Velugu Posted on May 14, 2022

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమిత్ షాకు 9 ప్రశ్నలతో కూడిన లేఖ రిలీజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతున్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ళలో బీజేపీ-టీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం హామీల్లో ఒకటైన గిరిజన యూనిర్శిటీకి మొక్షం ఎప్పుడని ప్రశ్నించారు రేవంత్. ఈ ప్రశ్నలకు సమాధానాలు  చెప్పకుండా.. తెలంగాణకు ఏముఖం పెట్టుకుని వస్తారని లేఖలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.

 

 

Tagged Telangana, Chief, Revanth reddy, Letter, union home minister, PCC, Amit Shah

Latest Videos

Subscribe Now

More News