
టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలపిించుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ .కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. పూర్తి మెజారిటీ ఉన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేల అవసరమేంటని ప్రశ్నించారు.
12 మంది ఎమ్మెల్యే లు ఒక్కొక్కరు ఒక్కో రోజు జాయిన్ అయ్యారని.. 12 మందిని సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చినా..దానిపై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు ఉత్తమ్. గురువారం పిటిషన్ ఇచ్చిన వారిని సస్పెండ్ చేయాలని గతంలోనే స్పీకర్ కు లెటర్ ఇచ్చామని..అయిన వారి దగ్గర నుండి విలీన లెటర్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ktr పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేసి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ల కొనుగోలు పై లోక్ పాల్ కు కూడా వెళుతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా ముఖ్యమంత్రి ఇంటికి స్పీకర్ ఏవిదంగా వెళుతారని ప్రశ్నించారు ఉత్తమ్. తెలంగాణ ను వ్యతిరేకించిన వైసీపీ, ఎంఐఎం ఈరోజు కేసీఆర్ కు మిత్రులయ్యారని అన్నారు.
రేపు ఇందిరా పార్కు వద్ద భట్టి విక్రమార్క 36 గంటల నిరాహారదీక్ష చేయనున్నారని అన్నారు ఉత్తమ్. మైనార్టీలు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉంటే శాసన సభలో దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. ధర్నా చౌక్ వద్ద పర్మిషన్ ఇవ్వకపోతే స్పీకర్ ఇంటి ముందు దీక్ష చేస్తామని హెచ్చరించారు.