
రాష్ట్ర ప్రభుత్వ తీరు, పాలనపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిపాదించిన యురేనియం తవ్వకo పై కమిటీ వేయనున్నట్టు తెలిపారు. యురేనియం తవ్వకాలు ఒక్క గిరిజనుల సమస్యే కాదని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యని అన్నారు. సీనియర్ లీడర్ వి.హన్మంత రావు అధ్యక్షతన తవ్వకాలపై కమిటీ వేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రాజెక్టుల అంచనాల పెంపు,అవినీతి పై కూడా మరో కమిటీ వేస్తామని, ఆ కమిటీకి చైర్మన్ ఉత్తమ్, కన్వీనర్ భట్టి ఉంటారని అన్నారు. 2 నెలల్లో కమిటీ అధ్యయనం చేసి… గవర్నర్ కి నివేదిక ఇస్తామన్నారు. కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. యాదాద్రి శిలల పై కేసీఆర్,కారు బొమ్మ చెక్కడం దారుణమని ఈ సందర్భంగా కుంతియా తెలిపారు.