
హైదరాబాద్, వెలుగు: పేదలకు భూములు ఉండొద్దని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పీసీసీ దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ ఆరోపించారు. అందులో భాగంగానే పేదల భూములను గుంజుకుని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గజ్వేల్‌లో ఓ ప్రైవేటు కంపెనీకి 4 లక్షలకు ఎకరం ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను రూ.5 లక్షల చొప్పున ఇస్తానని, కేసీఆర్ ఫాంహౌస్ తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితుల భూములను ప్రభుత్వం లాక్కోవడం, పంట నష్టం, భూమి హక్కులు తదితర అంశాలపై కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు గోస పేరిట సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు దీక్ష చేశారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, బాధిత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ.. కేసీఆర్ పిరికిపంద అని, తిరగబడితే పారిపోతాడు అని అన్నారు. ఓటమి భయంతో మహారాష్ట్రలో కేసీఆర్ మరో ఇల్లు కట్టుకుంటున్నాడన్నారు.