చిక్కడపల్లిని రాజకీయ అడ్డాగా మార్చారు : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

చిక్కడపల్లిని రాజకీయ అడ్డాగా మార్చారు : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
  •     బీఆర్ఎస్, బీజేపీలపై  చనగాని, రియాజ్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్న చిక్కడపల్లి ఏరియాను బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ అడ్డాగా మార్చేశారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మండిపడ్డారు. 

ఈ రెండు పార్టీలు నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. శనివారం దయాకర్, రియాజ్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  మౌలానా వర్సటీ భూములపై కలెక్టర్ వివరణ ఇచ్చినా.. బీఆర్ఎస్ మాత్రం తప్పుడు ప్రచారం సాగిస్తుందని ధ్వజమెత్తారు.