 
                                    హైదరాబాద్, వెలుగు: బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌పై కేటీఆర్ మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే బీసీలంటే ఆయనకు ఎంత ద్వేషం ఉందో స్పష్టమవుతోందని చెప్పారు.
నవీన్ యాదవ్‌పై కేటీఆర్ కక్షగట్టి తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్న తీరు.. రాష్ట్రంలోని బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ అధిష్టానం బీసీ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. కేటీఆర్ ఆయనపై విషం చిమ్మడం ఎందుకని ప్రశ్నించారు. చట్ట సభల్లో బీసీలు ఉండకూడదా అని ఫైర్ అయ్యారు.

 
         
                     
                     
                    