- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గాంధీ భవన్.. బీసీ భవన్ గా మారిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీ వాదానికి పునాది వేసి, కుల గణన చేపట్టి, 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చిత్తశుద్ధితో చేసిన పోరాటంతో రేవంత్ సర్కార్ పై బీసీలకు నమ్మకం పెరిగిందని తెలిపారు.
ఇటు ప్రభుత్వ పదవుల్లో అటు పార్టీ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయడంతోనే ఇప్పుడు గాంధీ భవన్.. బీసీ భవన్గా మారిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకే ప్రజలు పట్టం కడుతారని పేర్కొన్నారు. ఈ రెండేండ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీకి విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని వెల్లడించారు.
