- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మ్యాచ్ ఆడడంతో వరల్డ్ లోనే తెలంగాణ ప్రతిష్ట పెరిగిపోయిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు.
శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో మెస్సీ మ్యాచ్ జరగడం హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రపంచానికి చాటిచెప్పినట్లయిందని తెలిపారు. కోల్‌కత్తా మ్యాచ్ లో గొడవ జరగ్గా.. అదే రోజు ఇక్కడ మ్యాచ్ ప్రశాంతంగా జరగడం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన దక్షతకు నిదర్శనమన్నారు.
