ఇష్టమున్నట్లు మాట్లాడితే..కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తం : గజ్జెల కాంతం

ఇష్టమున్నట్లు మాట్లాడితే..కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తం : గజ్జెల కాంతం
  • సీఎంపై అనుచిత వ్యాఖ్యలు కరెక్ట్ కాదు: గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మరోసారి ఇష్టమున్నట్లు మాట్లాడితే కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే కేసీఆర్​ను విచారణకు పిలిచారని తెలిపారు. అవినీతికి పాల్పడితే సీఎంనైనా, ప్రధానినైనా విచారిస్తారని చెప్పారు.

దీనికి కేటీఆర్.. సీఎం రేవంత్​పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై రేవంత్ కక్ష సాధించాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉండేవారని తెలిపారు. తాగుబోతోళ్లు, రాష్ట్రాన్ని దోచుకున్నోళ్లు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. జాతిపితకు ఉండాల్సిన లక్షణాల్లో కేసీఆర్​కు ఒక్కటైనా ఉందా అని ఫైర్ అయ్యారు.