
హైదరాబాద్, వెలుగు : పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్) నేతలు కలిశారు. రాజకీయంగా తమకు అవకాశం కల్పించాలని కోరారు. 20 వేల నుంచి 75 వేల వరకు పద్మశాలిలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గాల వివరాలను రేవంత్ కు అందజేశారు.
టీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న జరిగిన పద్మశాలి రాజకీయ యుద్ధభేరి మహాసభ తీర్మానం మేరకు వివిధ పార్టీల అధ్యక్షులను కలుస్తున్నామని టీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ శ్రీనివాస్ పేర్కొన్నారు. రేవంత్ ను కలిసిన వారిలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్, వేముల బాలరాజు తదితరులు ఉన్నారు.