రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నడు : కురువ విజయ్ కుమార్

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నడు : కురువ విజయ్ కుమార్
  • రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నడు
  • గన్ పార్క్ వద్ద పీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు : గద్వాల ఎమ్మెల్యే టికెట్ ను రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడని పీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. ‘నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు’ అంటూ తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. 65 సీట్లను రూ.600 కోట్లకు రేవంత్​అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతోందన్నారు. రేవంత్ అక్రమాలపై ఈడీ, ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని 
హెచ్చరించారు. 

విజయ్, కలీం బాబా సస్పెన్షన్

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ కురువ విజయ్​ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆదివారం గాంధీభవన్​లో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన బహదూర్​పురా యాస్పిరెంట్​ కలీమ్ బాబాను కూడా సస్పెండ్​చేసింది. ఎవరు రూల్స్ ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చింది.