పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూపిస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సనత్‌నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే తలసాని రాజీనామా డ్రామాకు తెర లేపారన్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కృషితో ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసినా మళ్లీ గెలవబోడని ఎద్దేవా చేశారు.
