రాముడి పాలన నెహ్రూతోనే మొదలైంది :జగ్గారెడ్డి

రాముడి పాలన నెహ్రూతోనే మొదలైంది :జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలో రాముడి పాలన నెహ్రూతోనే మొదలైందని, రాముడు అందరి వాడని, ఏ ఒక్కరి సొంతం కాదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థతోపాటు దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్​ ప్రభుత్వమేనన్నారు. చరిత్రను కాదనే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.  నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ, అమిత్ షా పుట్టలేదని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిన్నామొన్న పుట్టినోళ్లని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

 నెహ్రూ బ్లడ్ లోనే త్యాగం ఉందని, గాంధీ, నెహ్రు చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరుతానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్లే లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీశ్​కు  ఇవన్నీ కన్పించడం లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.