వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అభివృద్ధికి కృషి : అటవీ ప్రధాన సంరక్షణాధికారి సువర్ణ

వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అభివృద్ధికి కృషి : అటవీ ప్రధాన సంరక్షణాధికారి సువర్ణ

హైదరాబాద్, వెలుగు: వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్​అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగాలని అటవీ ప్రధాన సంరక్షణాధికారి, పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. ఐడబ్ల్యూఎస్​టీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్​వుడ్​సైన్స్​అండ్​టెక్నాలజీ) తెలంగాణ, అటవీశాఖ వన శాస్త్ర, సాంకేతిక సంస్థ,   తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ (డబ్ల్యూబీఐ) అభివృద్ధిపై హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హోటల్ లో ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ మీట్ జరిగింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అగ్రోఫారెస్ట్రీ ప్రోత్సాహానికి అటవీశాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా వుడ్ డిమాండ్ పెరుగుతుందని, కేవలం అటవీ ప్రాంతంలో లభించే చెట్లు మాత్రమే కాకుండా రైతులు తమ పంట పొలాల్లో సేద్యాల ద్వారా వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి ​వాటితోపాటు త్వరగా పంట సాగుకు వచ్చే కలపపై దృష్టి పెట్టాలని సూచించారు.