అనంతనాగ్ -రాజౌరిలో హైవేపై ముఫ్తీ బైఠాయింపు

అనంతనాగ్ -రాజౌరిలో హైవేపై ముఫ్తీ బైఠాయింపు

బిజ్ బెహరా: తమ పార్టీ కార్యకర్తలను ఓటు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ జమ్మూకాశ్మీర్​లోని అనంతనాగ్ -రాజౌరి సీటు నుంచి పోటీ చేస్తున్న పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. బిజ్ బెహరా పోలీస్ స్టేషన్ ముందు శ్రీనగర్– -జమ్మూ నేషనల్ హైవేపై ఆమె బైఠాయించారు. తన ఫోన్ నుంచి ఔట్ గోయింగ్ కాల్స్​ను సైతం నిలిపివేశారని ముఫ్తీ ఆరోపించారు. 

అయితే, మిలిటెంట్లకు, అల్లర్లకు పాల్పడేవాళ్లకు సహకరించే వ్యక్తులను మాత్రమే తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఇదే నియోజకవర్గంలోని మెంధార్ పోలింగ్ కేంద్ర వద్ద ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రెండు వర్గాలను కట్టడి చేయడంతో గొడవ సద్దుమణిగింది.