
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ నేతలు ఆగస్టు 25న రాష్ట్ర సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్లోని ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ప్రారంభ కార్యక్రమం ఇవాళ్లే ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పీడీఎస్యూ నేతలను అమరవీరుల చిహ్నం వద్ద అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అరెస్ట్ అయిన నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్ మెంట్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.