
వనపర్తి, వెలుగు: జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలనిఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. ఆదివారం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎప్సీ దంపతులు పూజలు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనోత్సవాన్ని కూడా సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా, జాతీయ సమైక్యతను చాటేలా జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్రను సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి, క్రమశిక్షణతో రాజీవ్ చౌక్ కు చేరుకొని నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా సమస్య ఎదురైతే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.