ఫొటోగ్రాఫర్, వెలుగు : కేబీఆర్ పార్క్‌వద్ద శుక్రవారం సాయంత్రం నెమళ్లు కనువిందు చేశాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో షికారుకు వచ్చినట్లుగా కనిపించాయి. వాకింగ్‌ట్రాక్, ఫుట్‌పాత్‌పై తిరుగుతూ పావురాలతో ఆటలాడాయి. ఓ నెమలి పట్టుకునేందుకు ప్రయత్నించగా పావురం అక్కడి నుంచి తుర్రుమంది.
