బెంగళూరు: కరోనా ప్రజల అలవాట్లు, అభిరుచులనే కాక, కెరీర్ ఛాయిస్‌లను మార్చేసింది. ప్రతి నలుగురిలో ముగ్గురు లెర్నర్స్ తమ కెరీర్ అవకాశాలను మార్చుకోవాలని చూస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడించారు. లెర్నింగ్ కంపెనీ పియర్సన్ నిర్వహించిన సర్వేలో, 87 శాతం ఇండియన్ స్టూడెంట్లు ఆన్‌లైన్ లెర్నింగ్ చిల్ట్రన్స్ ఎడ్యుకేషన్‌లో భాగమైనట్టు పేర్కొన్నారు. కరోనా ఇప్పటికే ప్రజల వర్క్‌ను పూర్తిగా మార్చేసిందని 82 శాతం ఇండియన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఫలితంగా కొత్త స్కిల్స్, కొత్త జాబ్స్అవసరం ఎక్కువగా పడుతుందని 80 శాతం మంది తెలిపారు. 77 శాతం మంది తమ కెరీర్ అవకాశాలపై మరోసారి ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పారు.
అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు తమ కెరీర్ మార్గాలపై మరోసారి సమీక్షించుకోవాల్సి వస్తోందని పియర్సన్ సర్వే చెప్పింది. అమెరికా, ఇండియాతో కలిపి ఏడు దేశాలలో కరోనా మహమ్మారి చూపిన ప్రభావంపై సర్వే జరిపినట్టు పియర్సన్ తెలిపింది. 16 నుంచి 70 ఏళ్ల వయసున్న ఏడు వేల మందిపై ఈ సర్వే చేశారు. ఇండియా నుంచి వెయ్యి మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రైమరీ, సెకండరీ, హైయ్యర్ ఎడ్యుకేషన్‌ను ముందుకు నడిపించడంలో పర్మినెంట్‌గా భాగమైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 88 శాతం మంది లెర్నర్లు చెప్పారు.

