టీజీ పీఈసెట్లో 94.96% క్వాలిఫై

టీజీ పీఈసెట్లో  94.96%  క్వాలిఫై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్)లో 94.96% మంది క్వాలిఫై అయ్యారు. మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో పీఈసెట్ ఫలితాలను కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, పీఈసెట్ చైర్మన్, పాలమూరు వర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్, టీజీసీహెచ్​ఈ వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం రిలీజ్ చేశారు. బీపీఈడీ కోర్సులో సీట్ల కోసం 1,307 మంది పరీక్ష రాయగా.. 1,252 మంది క్వాలిఫై అయ్యారు. 

దీంట్లో అమ్మాయిలు 517 మంది, అబ్బాయిలు 735 మంది ఉన్నారు. డీపీఈడీ కోర్సులో 460 మంది పరీక్షకు అటెండ్ కాగా.. 426 మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో 280 అబ్బాయిలు, 146 మంది అమ్మాయిలు ఉన్నారు. కాగా.. నిరుడు 19 కాలేజీల్లో 1960 సీట్లు ఉండగా, 1,173 మాత్రమే భర్తీ అయ్యాయి. త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో టీజీసీహెచ్ఈ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, పాలమూరు వర్సిటీ రిజిస్ట్రార్ రమేశ్​ బాబు, పీఈసెట్ కన్వీనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.