కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూలగొట్టింది వాళ్లే : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు

కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూలగొట్టింది వాళ్లే :  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు
  •     రైతులకు బోనస్​ అందజేశాం
  •     పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు 

హైదరాబాద్​, వెలుగు:  ‘‘గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు దోచుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది వాళ్లే.. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్​ అంటూ ప్రచారం చేసుకుంది వాళ్లే.. సెల్ఫీలు దిగుతూ ప్రజలను మోసం చేసింది వాళ్లే.. చివరికి ప్రాజెక్టును కూలగొట్టింది వాళ్లే” అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతలు ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లినప్పుడు అరెస్టులు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు రేషన్ కార్డులు జారీ చేసి, నెలనెలా సన్నబియ్యం అందజేస్తుందన్నారు. 

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, గతంలో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ధాన్యం తరుగుపేరుతో రైతులను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు బోనస్ అందజేశామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని చెప్పారు.