దిల్ సుఖ్ నగర్, వెలుగు: ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ధ్యానాంజనేయ స్వామివారిని శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఎంపీ వంశీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల టైంలో గెలుపును కాంక్షిస్తూ ఆలయంలో కుటుంబంతో కలిసి ముడుపు కట్టానని, గెలవడంతో తన కుటుంబం కొద్ది నెలల క్రితం వచ్చి ముడుపు చెల్లించిందన్నారు. అప్పుడు తాను రాలేకపోయానని, దీంతో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నట్టు చెప్పారు. ఈవో లావణ్య, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు దుర్గారెడ్డి, ఎనుముల రవీందర్ రెడ్డి, రాజేశ్వరి ఉన్నారు.
